బండి సంజయ్ అరెస్ట్ పై స్పందించిన స్పీకర్ ఓం బిర్లా…! నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అధికారులకు ఆదేశం

-

బండి సంజయ్ అరెస్ట్ పై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. ఇప్పటికే కోర్ట్ 14 రోజలు రిమాండ్ ను విధించి క్రమంలో 14 రోజుల పాటు ఏదో ఒక నిరసన తెలియజేయాలని బీజేపీ అనుకుంటుంటే.. రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోంది.

ఇదిలా ఉంటే.. బండి సంజయ్ అరెస్ట్ పై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించినట్లు తెలుస్తోంది. ప్రివిలేజ్ మోషన్ కింద బండి సంజయ్ లోక్ సభ స్పీకర్ కు లేఖ రాశారు. ఎంపీగా తన హక్కులకు భంగం కలిగించారని లేఖలో పేర్కోన్నాడు. తాజాగా ఈ అంశంపై లోక్ సభ స్పీకర్ రాష్ట్ర అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. 48 గంటల్లో నిజ నిర్థారణ రిపోర్ట్ ఇవ్వాలని రాష్ట్ర అధికారులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన నోటీసులను రాష్ట్ర అధికారులకు పంపినట్లు తెలుస్తోంది.

ఉపాధ్యాయుల బదిలీ, జీవో 317 లో మార్పులపై గత ఆదివారం జాగరణ దీక్షకు పిలుపు నిచ్చారు. ఈ క్రమంలో కరీంనగర్ లోని తన కార్యాలయంలో జాగరణ కు సిద్ధమవుతున్న బండి సంజయ్ ని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై పోలీసులు సంజయ్ ను అరెస్ట్ చేశారు. దీనిపై కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు బండి సంజయ్ అక్రమ అరెస్ట్ కు నిరసనగా జేపీ నడ్డా ఈరోజు హైదరాబాద్ క్యాండిల్ ర్యాలీలో పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version