అగ్నిప్రమాదంలో నష్టపోయిన బోట్ల స్థానంలో లాంగ్ లైనర్లు సమకూర్చుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుంది అని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. 75శాతం సబ్సిడీ ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మత్సకారుల డీసెల్ బకాయిలు కూడా చెల్లిస్తామన్నారు. త్వరలో 4 కోట్లు 15 రోజుల్లో విడుదల చేయమని సీఎం ఆదేశించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదాన్ని కొందరు రాజకీయం చేయడానికి ప్రయత్నించారు. పరిహారం ఇస్తున్న దశలో సీఎం కు వ్యతిరేకంగా నినాదాలు చేయించారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా అర్హులకు పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. రాజకీయాలు అతీతంగా విలువలో 80 శాతం చెల్లింపు చేయాలని చెప్పారు. కలాశీలకు పది వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం చెప్పారు. ఇప్పుడు దాదాపు 400 మంది కలాశీలకు మేలు జరుగుతోంది. ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణకు ప్రభుత్వం 150 కోట్లు మంజూరు చేసింది. ప్రకృతి వైపరీత్యంతో ప్రమాదాలు మత్సకారులకు సహజం అని.. విశాఖ హార్బర్ ప్రమాదం మానవ తప్పిదం..కానీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉదారత చాటుకున్నారు. గత ప్రభుత్వాలకు ఇప్పుడు చూస్తే నక్కకు నాగ లోకానికి వున్న తేడా ఉందన్నారు. 150 కోట్ల తో హార్బర్ ఆధునీకరణ గొప్ప నిర్ణయం అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న జట్టీలు నిర్మాణం గతంలో ఎప్పుడు జరగలేదు
ఫిషింగ్ జట్టీల ఏర్పాటు తో ఆర్థిక ప్రగతి వుంటుంది