దేశంలోనే పొడవైన రైల్ కం రోడ్డు వంతెన….ఎక్కడుందో తెలుసా?

-

అస్సాంలోని డిబ్రూగడ్‌ సమీపంలో బోగిబీల్‌ వద్ద భారత ప్రభుత్వం  నిర్మించిన దేశంలోనే అతి పొడవైన రైల్‌ కం రోడ్డు వంతెనను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు. వాజ్ పేయీ జయంతి సందర్భంగా ఢిల్లీలో నివాళులర్పించిన మోదీ..మంగళవారం మధ్యాహ్నం డిబ్రూగడ్ చేరుకుని బ్రహ్మపుత్రానది దక్షిణ ఒడ్డును నిర్మించిన 4.94 కిలోమీటర్ల పొడవైన డబుల్‌ డెక్కర్‌ వంతెనను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం అస్సాం గవర్నర్‌ జగదీష్‌ ముఖి, ముఖ్యమంత్రి శర్వానంద్‌ సోనోవాల్‌తో కలిసి వంతెనపై కొంతదూరం నడిచారు.

డిబ్రూగఢ్‌లో ప్రారంభమైన ఈ వంతెన అస్సాంలోని థేమాజి జిల్లాలో ముగుస్తుంది. అస్సాం ఒప్పందంలో భాగంగా 1997-98లో మంజూరైన ఈ వంతెన అరుణాచల్‌ ప్రాంతంలో భారత్‌-చైనా సరిహద్దుల్లో రక్షణ పరంగా కీలక భూమిక పోషించనుంది. ఈ తరహా బ్రిడ్జి దేశంలో మరెక్కడా లేదని ఇది అత్యంత పొడవైనది అధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news