టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. కేరళలో జగ్గుస్వామి అందుబాటులో లేకపోవడంతో… నిన్న జగ్గుస్వామికి లుక్‌అవుట్ సర్క్యులర్ జారీ చేసింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి B.Lసంతోష్, తుషార్, జగ్గుస్వామి విచారణకు హాజరుకాకపోవడంపై… ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. విచారణకు సహకరించాలని B.L సంతోష్‌కు హైకోర్టు ఇదివరకే ఆదేశాలు జారీచేసింది.
మరోవైపు నిన్న శ్రీనివాస్‌ను సిట్ అధికారులు దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించారు. సింహయాజితో ఉన్న సంబంధాలపై సేకరించిన ఆధారాలను ముందు పెట్టుకొని మరీ ప్రశ్నించారు. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, ఫామ్ హౌస్ లో జరిగిన సంప్రదింపులపై తనకు ఏమాత్రం అవగాహన లేదని శ్రీనివాస్ చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన నందకుమార్ తోనూ శ్రీనివాస్‌కు సత్సంబంధాలే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇవాల మరోసారి తమ ఎదుట హాజరు కావాలని అధికారులు శ్రీనివాస్‌కు చెప్పారు