శ్రీరాముడు పుట్టింది.. పరిపాలించింది ఏ నగరాన్ని..? అని ఒకటవ తరగతి చదివే పిల్లవాడ్ని అడిగినా.. అయోధ్య అని.. ఠక్కున సమాధానం చెబుతారు.. కానీ ఆ దేశ ప్రధానికి ఆ మాత్రం జ్ఞానం కూడా లేదు. ఇంకెవరు.. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలినే.. ఆయనే తాజాగా పనికిమాలిన వ్యాఖ్యలు చేశారు. రాముడిది అసలు అయోధ్యే కాదని.. అతను నేపాల్‌లో పుట్టాడని.. అతను నేపాలీయుడని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలను భారతీయులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
నిజానికి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి గత కొద్ది రోజులుగా చైనాకు వంత పాడుతూ భారత్‌ను ఏదో ఇబ్బందుల్లోకి నెట్టాలని అనుకుంటున్నారు. అందులో భాగంగానే చైనా కుయుక్తులకు తలొత్తి భారత్‌లోని కొన్ని ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ ఆయన ఏకంగా ఓ కొత్త నేపాల్ మ్యాప్‌నే అచ్చు వేయించారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. భారత్ దెబ్బకు చైనాలాంటి అగ్రదేశమే సరిహద్దు నుంచి తోక ముడిచింది. దీంతో నేపాల్‌కు తిప్పలు ఎదురవుతున్నాయి. మరోవైపు కేపీ శర్మ ఓలి బయటే కాదు.. ఇంటా విమర్శలను ఎదుర్కొంటున్నారు.
Real Ayodhya lies in Nepal, not in India. Lord Ram is Nepali not Indian: Nepali media quotes Nepal Prime Minister KP Sharma Oli (file pic) pic.twitter.com/k3CcN8jjGV
— ANI (@ANI) July 13, 2020
నేపాల్‌లో కోవిడ్‌ను అరికట్టలేకపోయారని, భారీగా అవినీతికి పాల్పడ్డారని యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. అలాగే కేపీ శర్మ ఓలి ప్రభుత్వం పడిపోయే స్థితిలో ఉంది. అలాంటి స్థితిలో భారత్‌పై లేనిపోని విమర్శలు చేయడం.. అనవసరంగా గెలకడం అవసరమా..? అని ప్రశ్నిస్తున్నారు. ఎంతైనా చైనా చేతిలో బానిసగా మారాడు కదా.. ఇలాంటి పిచ్చి కూతలే వస్తాయి మరి..!