చాంద్రాయణగుట్ట నుంచి వనస్థలిపురం వెళ్తున్న సిమెంట్ లారీ ఐఎస్ సదన్ వద్ద ముందు వెళ్తున్న బైకర్ ను ఢీ కొట్టింది. లారీ కిందికి వెళ్ళిపోయాడు బైకర్. లారీ ని ఆపకుండా డ్రైవర్ పారిపోయాడు. బైక్ తో సహా లారీ పైకి వాహనదారుడు ఎక్కేసాడు. రెండు కిలోమీటర్ల వరకు లారీ ని ఆపకుండా లారీ డ్రైవర్ వెళ్ళిపోయాడు. రెండు కిలోమీటర్ల పాటు లారీ బ్యానెట్ పైనే నిలబడి ఆపాలని చెప్పాడు బైకర్. రోడ్డుకు అడ్డంగా మరో వాహనం రావడంతో బ్రేకులు వేసాడు లారీ డ్రైవర్.
ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రెండు కిలోమీటర్ల పాటు బానెట్ పై బైకర్ నిలబడ్డాడు. లారీ వెనకాల ఉండి దీనిని మొత్తం సెల్ ఫోన్లో రికార్డ్ చేసారు ఓ కార్ డ్రైవర్. వీడియో ఆధారంగా లారీ డ్రైవర్ ని పోలీసులు పట్టుకున్నారు.పృద్వీ రాజ్ అనే లారీ డ్రైవర్ ని ఈరోజు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బైక్ పై ఉన్న వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు.