అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

-

అనంతపురం: గుత్తి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన గుత్తి హైవేపై జరిగింది. మృతులు కర్నూలు జిల్లా వాసులు అశ్రఫ్‌ అలీ, లాయక్‌ అలీ, ఖాసీంగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా హైవేపై లారీ అతివేగమే కారణమని తెలుస్తోంది. అయితే లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండి కారును ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. మరేదైనా కారణాలు ఉండచ్చనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఘటనాస్థలంలోని ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకి తీసి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ధ్వంసమైన రెండు వాహనాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు.

 

ఈ తెల్లవారుజామున ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. ఇదే ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అటు ప్రజలు కూడా సహకరించాలని పోలీసులు అంటున్నారు. రోడ్డు సేఫ్టీని పక్కాగా ఫాలో అవ్వాలని, అలా చేస్తే ప్రమాదాలను నివారించొచ్చని పోలీసులు చెబుతున్నారు. అతివేగంగా వాహనాలు నడిపి కుటుంబాలను విషాదంలో ముంచొద్దని సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version