రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రన్నింగ్ కారుపై లారీ ట్రాలీ బోల్తా పడటంతో నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. బికనీర్‌లోని దేశ్ఋనోక్ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మహిళ సహా ఐదుగురు వ్యక్తులు తమ బంధువుల వివాహానికి హాజరై కారులో తిరిగి వస్తుండగా.. దేశ్‌నోక్ ఫ్లైఓవర్ వద్దకు రాగానే పక్కనే బూడిద లోడ్‌తో వెళుతున్న ఓ లారీ ట్రాలీ ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించి కారుపై పడింది. ఒక క్రేన్,మూడు జేసీబీల సహాయంతో ట్రాలీని తొలగించగా.. కారు మొత్తం ట్రాలీలోని బూడిదతో నిండిపోయింది. కారులోని వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.