కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమావేశం కోసం బడి పిల్లలు కాస్త పని మనుషులయ్యారు. ఎమ్మెల్యే మీటింగ్ కోసం ఏర్పాటు చేయాల్సిన అరెంజె మెంట్స్ మొత్తం స్కూల్ పిల్లలకే అప్పగించారు. ఉపాధ్యాయులు చెప్పడంతో విద్యార్థులు పుస్తకాలు పక్కనెట్టి కుర్చీలు మోస్తున్నారు.
ఈ ఘటన మహాబూబాబాద్ జిల్లా తోర్రూర్ మండలంలోని అమ్మాపురం గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. మధ్యాహ్నం భోజన పథకం వంట పాత్రల పంపిణీ కార్యక్రమానికి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రానున్నారని తెలిసి అక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, ఉపాధ్యాయులు విద్యార్థులతో పనిచేయిస్తున్నారని తెలిసి తల్లిదండ్రులు వారిపై మండిపడ్డారు.