బరువు తగ్గాలా..? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ని ఇలా తీసుకుంటే చాలు..!

-

చాలా మంది బరువు తగ్గడం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బరువు బాగా ఎక్కువ ఉండడం వలన బరువు తగ్గడానికి చూస్తూ ఉంటారు. మీరు కూడా మీ బరువుని తగ్గాలనుకుంటున్నారా..? బరువు తగ్గి అందంగా కనపడాలని చూస్తున్నారా..? అయితే కచ్చితంగా వీటిని చూడాల్సిందే. ఇలా కనుక మీరు అనుసరించారంటే ఈజీగా బరువు తగ్గడానికి అవుతుంది. మరి బరువు ఎలా తగ్గొచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ విషయాలలో ఈ చిట్కాలని మీరు ఫాలో అయితే ఈజీగా త్వరగా బరువు తగ్గడానికి అవుతుంది.

బ్రేక్ఫాస్ట్ కింద వీటిని తీసుకోండి:

ఉదయాన్నే 10 ఎమ్‌ఎల్ ఉసిరి జ్యూస్ తీసుకోండి.
నానబెట్టిన బాదం ని కొంచెం తీసుకోండి.
తరవాత మల్టీగ్రెయన్ బ్రెడ్, గ్రిల్డ్ వెజిటేబుల్స్ ని తీసుకోవచ్చు.
పరాఠాలు కూడా తినచ్చు.
పెరుగు, దాలియా, ఓట్స్ ని తీసుకోవచ్చు.
లేదంటే 2 ఉడికించిన గుడ్లు, 2 ఇడ్లీలు తీసుకోవచ్చు..
కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ రసం కానీ చియా సీడ్స్ వాటర్ ని కానీ తీసుకోవచ్చు.

మధ్యాహ్నం భోజనం:

ఒక కప్పు పప్పు, ఒక రోటీ లేదా రాజ్మా చావల్ తీసుకోవచ్చు.
బ్రౌన్ రైస్, వెజిటేబుల్స్ ని తీసుకోవచ్చు.
పెరుగు తీసుకోవచ్చు.
సోయాబీన్ కర్రీ తినచ్చు.
మల్టీగ్రెయిన్ రోటి లేదా సలాడ్ ని తీసుకోవచ్చు.

డిన్నర్ కి:

గ్రిల్డ్ చికెన్ లేదా చేపలు తీసుకోవచ్చు.
1 మల్టీగ్రెయిన్ రోటీ ని కానీ గ్రిల్డ్ టోఫు సలాడ్ ని కానీ తీసుకోవచ్చు.
లో ఫ్యాట్ మిల్క్ ని తీసుకోవచ్చు.

ఎక్కువ నీళ్లు తాగాలి.

భోజనానికి గంట ముందు నీళ్లు ఎక్కువ తాగండి.
బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేయొద్దు.
కొవ్వు ఎక్కువ వుండే వాటిని తీసుకోవద్దు.
స్వీట్స్ వంటి వాటికీ దూరంగా వుండండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version