ప్రస్తుత రోజులలో అక్రమ దందాలు అనేక సంఖ్యలో నమోదు అవుతున్నాయి. సుమారు 1.5 కోట్ల విలువగల సిగరెట్లను ఢిల్లీ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే… ఉత్తరప్రదేశ్ లోని వారణాసి- ఢిల్లీ మధ్య రవాణా జరిగే ప్రత్యేక రైల్లో భారీ స్థాయిలో సిగరెట్లను రవాణా చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందుకున్నారు. దీనితో అధికారులు వెంటనే ఢిల్లీ రైల్వే స్టేషన్ కు చేరుకొని ఆ రైలు స్టేషన్ కు చేరుకున్న వెంటనే అధికారులు కలిసి తనిఖీ చేపట్టారు.
దాదాపు 100 పెట్టెలలో, ప్యాక్ చేసిన 10 లక్షల సిగరెట్ల తో పాటు, 38 బ్యాగులలో ఉంచిన 36 లక్షల విలువైన మొత్తం 9 లక్షల సిగరెట్లను అధికారులు పట్టుకున్నారు. ఇక ఇందుకు సంబంధించిన ఒక వ్యక్తిని కూడా కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. భారీగా సిగరెట్ల తరలింపుపై ఢిల్లీ కస్టమ్స్ అధికారులు ఈ వ్యాపారంలో ఎవరి హస్తం ఉందొ అని దర్యాప్తు మొదలు పెట్టారు.