తిరుపతిలో ఉన్న హథీరాంజీ మఠం లో భారీగా బంగారం, వెండి వస్తువులు మిస్ అయ్యాయి. తాజాగా హథిరాంజీ మఠం కు చెందిన అకౌంటెంట్ గుర్రప్ప అనారోగ్యం కారణంగా మృతి చెందగా, ఆ తర్వాత అధికారులు జరిపిన సోదాలలో ఈ విషయం బయటికి వచ్చింది. ముందుగా అకౌంటెంట్ బీరువాలోని బంగారు నగలకు సంబంధించిన లెక్కలు సరిపోకపోవడంతో దాన్ని గమనించిన అధికారులు… మఠానికి సంబంధించిన కొన్ని విలువైన బంగారు, వెండి వస్తువులు మిస్ అయినట్లు వారు గుర్తించారు. అలాగే మఠం లోని కొన్ని బీరువా కు సంబంధించి తాళం చెవులు కనిపించకపోవడంతో వారి ఇంట్లో మఠానికి సంబంధించిన కొన్ని తాళాల గుత్తులు లభించాయి.
ఇక ఆ తాళాలను తీసుకువచ్చి అధికారుల సమక్షంలో బీరువాలను తెరిచి అందులోని బంగారు, వెండి నగల కు సంబంధించిన లెక్కలను సరి చూశారు. ఇక అందులో 108 గ్రామాలకు సంబంధించిన బంగారు డాలర్స్, అలాగే కొన్ని విలువైన వెండి వస్తువులు కూడా మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయం సంబంధించి మఠంలో సిబ్బంది ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో తరచుగా ఆలయాలకు సంబంధించి కూడా ఇలాంటి తప్పుడు లెక్కలు బయటపడుతున్న సంగతి మనకు విదితమే.