దేవరకొండతో రష్మిక ఎఫైర్‌..ఇదిగో ఇవే సాక్ష్యాలు !

-

ఆన్ స్క్రీన్ లవ్లీ ఫెయిర్ గా వివో హృదయాలను గెలుచుకున్నారు రష్మిక, విజయ్ దేవరకొండ. గీత గోవిందం సినిమా లో రష్మిక- విజయ్ దేవరకొండ ల మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. అదే సమయంలో రష్మిక మందాన సైతం తన ప్రియుడు, కన్నడ నటుడు రోహిత్ శెట్టి తో నిశ్చితార్థాన్ని రద్దు చేసు కోవడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. విజయ్ దేవరకొండ తో ప్రేమలో ఉండటంతోనే ఆమె రోహిత్ కు బ్రేకప్ చెప్పారని పలువురు అంటున్నారు కూడా.

అయితే ఈ వార్తలపై వీరిద్దరు ఎప్పుడు కామెంట్ చేయలేదు. ఇదిలా ఉండగా…డిసెంబర్‌ 31 న గోవాలో ఈ జంట ఫుల్‌ ఎంజాయ్‌ చేసింది. దానికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ కూడా అయ్యాయి. అయితే.. తాజాగా వారిద్దరి మధ్య లవ్‌ ట్రాక్‌ నడుస్తుందని మరో హింట్‌ ఇచ్చింది ఈ జంట. సంక్రాంతి పండుగ నేపథ్యంలో… విజయ్‌.. తన కుటుంబంతో దిగిన ఫోటోలను షేర్‌ చేయగా… అటు రష్మిక కూడా ఫోటోలను షేర్‌ చేసింది. అయితే.. ఈ ఫోటోల్లో విజయ్‌, రష్మిక ఒకే కలర్‌ డ్రెస్‌ లు వేశారు. విజయ్‌ రెడ్‌ కలర్‌ కుర్తా వేయగా… రష్మిక కూడా… రెడ్‌ కలర్‌ డ్రెస్‌ వేసింది. దీంతో వారిద్దరూ లవ్‌ లో ఉన్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version