లవ్ టూ డే మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

-

ఇటీవలే తమిళంలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకుపోతున్న ‘లవ్ టుడే’ సినిమా తెలుగు విడుదలకు ముస్తాబవుతుంది. ప్రదీప్ రంగనాథన్ నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈచిత్రం తమిళంలో నవంబర్ 4న రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి తమిళ ప్రేక్షకుల నుండి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో తెలుగులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.

ఈ సినిమా తెలుగు హక్కులను దిల్ రాజు దక్కించుకున్నట్లు టాక్. కాగా, ఈ చిత్రాన్ని నవంబర్ 25న రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడట. దీనిపై అధికారిక ప్రకటన చేసింది. నవంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కల్పతి ఎస్. అగొరం, కల్పతి ఎస్. గణేష్, కల్పతి ఎస్.సురేష్ సంయుక్తంగా నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version