కారులో ఊపిరి ఆడక నలుగురు పిల్లలు మృతి !

-

కారులో ఊపిరి ఆడక నలుగురు పిల్లలు మృతి చెందారు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలోని రంధియా గ్రామంలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పిల్లలు మరణించారు.  గుజరాత్ రాష్ట్రం అమ్రేలిలో తల్లిదండ్రులు పనులకు వెళ్లగా 2 నుంచి 7 ఏళ్ల వయసు ఉన్న నలుగురు పిల్లలు ఆడుకున్నారు. ఈ తరుణంలోనే… కారులోకి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నారని సమాచారం.

Four children died of suffocation in the carఅయితే… పనులకు వెళ్లిన తల్లిదండ్రులు వచ్చే సరికి.. అంటే సాయంత్రం వచ్చి చూడగానే నలుగురు విగతజీవులుగా కనిపించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు పోలీసులు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు గుజరాత్‌ పోలీసులు. బాధితుల్లో ఇద్దరు బాలికలు మరియు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version