బిగ్ బాస్ ఓటీటీ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. నిన్న సాయంత్రం మస్తీలో భాగంగా.. చాలెంజర్స్ – వారియర్స్ మధ్య చాలా రసవత్తరకర చర్చ కొనసాగింది. ఛాలెంజర్స్ (కొత్తవాళ్లు), వారియర్స్ (పాత వాళ్లు) కి గుడ్వైబ్స్ ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి. బ్యాడ్ వైబ్స్ ఎవరి దగ్గర ఉన్నాయో చెప్పాలని బిగ్ బాస్ చిన్న ఫిటింగ్ పెట్టడంతో.. రంగంలోకి దిగిన అరియానా.. అజయ్ నుంచి తనకు గుడ్ వైబ్స్ ఉన్నాయని ఓపెన్ గా చెప్పేసింది.
నాకు స్టార్టింగ్ లోనే అజయ్ నచ్చేశాడంటూ.. ఓపేన్ అయింది. అజయ్ సమయస్ఫూర్తి నాకు నచ్చింది.. మనద్దరి మధ్య బాండింగ్ ఇలానే ఉండాలని ఎక్స్ పెక్ట్ చేస్తున్నానని అరియానా ఎమోషనల్ వ్యాఖ్యలు చేసింది. బ్యాడ్ వైబ్స్ తనకు శ్రీ రాపాక తోనే ఉందని చెప్పింది ఆర్యానా. నాకు ఓవరాక్షన్ అని చెప్పింది.. ఈ గేమ్ ఇలాగే ఉంటుంది.
నన్ను ఓవరాక్షన్ అని చెప్పడం నచ్చలేదని తెలిపింది. ఆ తర్వాత అఖిల్ కూడా శ్రీ రాపాక తో వైబ్స్ లేవు అని చెప్పాడు. ఇద్దరి మధ్య బిల్డింగ్ కుదరడం లేదని… అజయ్ ఏదో చెప్పాడని చెప్పాడు అఖిల్. అయితే తను ఆ మాట అనలేదని… ఒకవేళ అంటే కనుక.. ఫ్రూఫ్స్ చూపించాలని కోరింది శ్రీ రాపాక. ఇక ముమైత్ ఖాన్ కూడా అజయ్ తో మంచి వైబ్జ్ ఉన్నాయని అతనికి మంచి మార్కులు వేసింది. అంతేకాదు ఐ లవ్ యు కూడా చెప్పింది ముమైత్ ఖాన్. దీంతో బిగ్ బాస్ వోటింగ్ చాలా రసవత్తరంగా మారింది. ఇక తర్వాత ఎపిసోడ్ లొ ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.