టోక్యో ఒలింపిక్స్ : బాక్సర్ ల‌వ్లీనాకు కాంస్యం

-

టోక్యో ఒలింపిక్స్‌ సెమీస్ పోరులో లవ్లీనా ఓటమి పాలైంది. తీవ్రమైన ఉత్కంఠ పోరులో లవ్లీనా బొర్గొహెయిన్‌ నిరాశ పరిచింది. టర్కీ బాక్సర్ బుసెనాజ్ సుర్మేనెలి … లవ్లీనా పై అద్భుతమైన విజయం సాధించింది. 64-69 కిలోల విభాగంలో జరిగిన సెమీస్‌ పోరులో లవ్లీనా ఓటమి చవి చూసింది. ఈ పోరులో టర్కీ బాక్సర్ బుసెనాజ్ సుర్మేనెలి చేతిలో 0-5 తేడాతో పరాజయం పాలైంది.

మూడు రౌండ్ల లోనూ టర్కీ బాక్సర్ బుసెనాజ్ సుర్మేనెలి లవ్లీనా పై ఆధిపత్యం చెలాయించింది. దీంతో లవ్లీనా పరాజయం పాలైంది. ఓటమి పాలైనప్పటికీ లవ్లీనా బొర్గొహెయిన్‌ చరిత్ర సృష్టించింది. బలింపిక్స్‌ లో పతకం సాధించిన భారత మూడో బాక్సర్‌గా అవతరించింది. దీంతో లవ్లీనా కాంస్య పతకానికే పరిమితమైంది. ఇక అటు రెజ్లింగ్‌ లో భారత క్రీడాకారులు శుభారంభం చేశారు. రవి దహియా, దీపక్‌ పునియా క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నారు వీరు ప్రత్యర్థులపై తిరుగులేని విజయాలు సాధించారు.దీంతో వీరు క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news