తక్కువ కార్బోహైడ్రేట్లు ఎక్కువ ప్రోటీన్లు కలిగిన ఆహారాలు..

-

కార్బోహైడ్రేట్లని ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతుంటాం. ఈ విషయం అందరికీ తెలుసు. అందుకే కార్బోహైడ్రేట్లని ఆహారంగా తీసుకోవడానికి భయపడతారు. అలాగని అసలు కార్బోహైడ్రేట్లు లేకుండా ఆహారం తింటే శక్తి పుట్టకుండా నీరసం వచ్చేస్తుంది. అందుకే మన శరీరానికి కార్బోహైడ్రేట్లు చాలా అవసరం. ఏదైనా మితంగా తీసుకుంటే అది మేలే చేస్తుంది. ప్రస్తుతం మన తెలుసుకోబోయేది తక్కువ కార్బోహైడ్రేట్లు గల ఆహారాలు ఏంటనేది. అలాగే ఎక్కువ ప్రోటీన్లు కలిగి ఉండి మనకు మేలు చేసే ఆహార పదార్థాలు.

మొదటగా:

చియా విత్తనాలు

చియా విత్తనాలని ఓట్స్ లో కలిపి మిక్స్ చేసుకుని ఆహారంగా తీసుకుంటే మంచిది. ఇందులో కార్బోహైడ్రేట్లు మరీ అధికంగా ఉండకుండా ప్రోటీన్లు కావల్సినన్ని ఉంటాయి. ఇందులో ప్రోటీన్ తో పాటు ఫైబర్ శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది.

పుటగొడుగులు

బ్రేక్ ఫాస్ట్ కోసమైనా, రాత్రి డిన్నర్ కోసమైనా హాయిగా భుజించే ఆహారం. ఇందులో కొద్దిగా ఉప్పు కలుపుకుని ఆహారంగా తీసుకుంటే బాగుంటుంది. 7గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కార్బోహైడ్రేట్లు 3.2మాత్రమే ఉంటాయి.

బాదం వెన్న

మీరు తినే బ్రెడ్ పై కొద్దిపాటి బాదంవెన్నని కలుపుకుంటే చాలా మంచిది. 8గ్రాముల ప్రోటీన్ ఉన్న దీనిలో ఒక గ్రాము మాత్రమే కార్బోహైడ్రేట్లు ఉంటాయి.

స్పిరులినా

10గ్రాముల స్పిరులినాని తీసుకుని మీరు ఆహారంగా తీసుకునే భోజనంతో పాటు తినేయండి. ఇందులో గుడ్డుతో సమానంగా పోషకాలు ఉంటాయి. 6.5గ్రాముల ప్రోటీన్ ఉన్న స్పిరులినాలో 3.3గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి.

పిస్తా

మీకు కావాల్సిన సమయంలో తినగలిగే ఆహారమైన పిస్తాలో 8గ్రాముల ప్రోటీన్, 8గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version