LPL 2023: కెప్టెన్ హసరంగ వీర విహారం 27 బంతుల్లో 64 పరుగులు !

-

లంక ప్రీమియర్ లీగ్ 2023 లో ఈ రోజు జరుగుతున్న డబుల్ హెడర్ లో మొదటి మ్యాచ్ లో గాలే టైటాన్స్ మరియు బి లవ్ క్యాండీ జట్లు పోటీ పడుతున్నాయి. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన టైటాన్స్ నిర్ణీత ఓవర్ లలో అయిదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో కెప్టెన్ మరియు ఆల్ రౌండర్ గా ఉన్న వానిందు హాసరంగా సిక్సులు మరియు ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఇతను కేవలం 27 బంతుల్లో 64 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు మరియు 2 సిక్సులు ఉన్నాయి, మొదటి బంతి నుండి క్యాండీ బౌలర్లపై వీరవిజృంభణ చేశారు. ఇతనికి మత్యుస్ నుండి చక్కని సహకారం లభించింది. ఈ స్కోర్ ఛేదించడం క్యాండీ టీం కు సులభమే అనుకున్నా.. మొదట్లోనే ఒత్తిడితో వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉంది.

ఇప్పటి వరకు 11 ఓవర్లలో కేవలం 65 పరుగులు మాత్రమే చేసి ఓటమికి దగ్గరగా ఉంది. మరి ఎవరైనా అద్భుతమ్హ్ చేస్తారా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news