IPL 2022 : ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్

-

సోమ‌వారం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ 12 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. ఇప్ప‌టికే రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో ఓడిపోయిన హైద‌రాబాద్.. రెండు ఓట‌మిల‌ను మూట‌గట్టుకుంది.

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టు నిర్ణ‌త 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 169 ప‌రుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెంట్స్ కేఎల్ రాహుల్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

నిన్నటి మ్యాచ్ లో లో అర్థ సెంచరీతో కె.ఎల్.రాహుల్ మెరిశాడు. అయితే కేఎల్ రాహుల్ కు టీ20ల్లో ఇది 50వ అర్ధ సెంచరీ. ఈ ఎలైట్ లిస్టు లో ఇండియా నుంచి మరో నలుగురు మాత్రమే ఉన్నారు. విరాట్ కోహ్లీ 76 ఆఫ్ సెంచరీలతో తొలి స్థానంలో ఉన్నాడు. కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ 69, శిఖర్ ధావన్ 63, సురేష్ రైనా 53 హాఫ్ సెంచరీలు చేసి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version