మహిళలు గర్భంతో ఉన్నప్పుడు ఎలాంటి, ఏరకమైన దుస్తులు ధరించాలి అనే దానికి సంబంధించి యూపీలో ఓ యూనివర్శిటీ ఓ కొత్త కోర్స్ ను ప్రారంభించింది. ఈ కోర్సు ద్వారా మతృత్వం, ప్రెగ్నెంట్ మహిళ ఏం తినాలి, ఏ దుస్తులు ధరించాలి,ఎలా ఆ మహిళ వ్యవహరించాలి, ఆమెను ఆమె ఎలా ఫిట్ గా ఉంచుకోవాలని, ఏవిధమైన మ్యూజిక్ ఆమెకు మంచిగా ఉంటుంది అనే విషయాలను బోధిస్తారు. అలాగే ఈ కోర్సు పేరు “గర్భ్ సంస్కార్” గా నిర్ణయించింది.
దేశంలోనే మొదటిసారిగా ఇప్పుడు లక్నో యూనివర్శిటీ ఈ కోర్సును ప్రారంభించింది. ఈ కోర్సు ద్వారా యువతకు ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు. అలాగే, పెళ్లయ్యాక విద్యార్థినులు తల్లులుగా మారే క్రమంలోనూ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఆ రాష్ట్ర గవర్నర్, వర్సిటీల ఛాన్స్‌లర్ ఆనందిబెన్ పటేల్ సూచనల మేరకు ఈ కోర్సులు ప్రవేశపెడుతున్నారు.