చాలా మంది యువకులు పెళ్లికాకముందు చాలా సన్నగా ఉంటారు. అయితే పెళ్లయ్యాక కొద్దిరోజులకే పొట్టతో దర్శనమిస్తుంటారు. నిజానికి అత్తగారింట్లో అల్లుడు ఎల్లప్పుడూ సెలబ్రిటీ నే. ఎప్పుడు ఏ సమయంలో వెళ్ళినా కనీస మర్యాదలు వారికి అత్తమామలు తోచిన విధంగా చేపడతారు. మరికొందరు అత్తలైతే అల్లుడు వస్తున్నాడు అంటే చాలు ఎక్కడ లేని కంగారు వారికి వచ్చేస్తుంది. అంతేకాకుండా కుమార్తెను అడిగి మరీ అల్లుడికి ఎలాంటి వంటలు ఇష్టమో కనుక్కొని చేయాలని తహతహలాడుతోంది. మరి ఇలాంటి అత్త మన ఆంధ్రప్రదేశ్ లో కొత్త అల్లుడికి ఏకంగా 67 రకాల వంటలను సిద్ధం చేసింది.
ప్రస్తుతం ఈ భోజనానికి సంబంధించి వీడియో ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది. ఇక అత్త చేసే వంటకాల్లో కేకు కటింగ్ నుండి మొదలు పెడితే స్వీట్లు, బజ్జీలు, వడియాలు, లడ్డూలు ఇలా చెప్పుకుంటూ పోవాలంటే కష్టమే. అంతేకాదు ఆ వెరైటీల గురించి వీడియోలో చక్కగా వివరించింది ఆ అత్త. ఇందుకు సంబంధించి ట్విట్టర్లో అనేక మంది వారి స్టైల్ లో ఫన్నీ కామెంట్స్ ను జత చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి మంచి అత్త దొరకడం అల్లుడు చేసుకున్న పూర్వజన్మ సుకృతమే.
<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>This lady has prepared a 67-item Andhra five-course lunch for her visiting son-in-law, consisting of a welcome drink, starters, chaat, main course and desserts! Wow! <a href=”https://twitter.com/hashtag/banquet?src=hash&ref_src=twsrc%5Etfw”>#banquet</a> <a href=”https://t.co/Li9B4iNFvc”>pic.twitter.com/Li9B4iNFvc</a></p>— Ananth Rupanagudi (@rananth) <a href=”https://twitter.com/rananth/status/1280784332144013312?ref_src=twsrc%5Etfw”>July 8, 2020</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>