వైరల్‌గా మారిన రమ్యకృష్ణ చిన్నప్పటి ఫొటో..!

-

శివగామి రమ్యకృష్ణ షేర్ చేసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నప్పుడు తన క్లాస్‌మేట్స్‌ తో తీసుకున్న ఓ ఫొటోను ఇటీవల సోషల్ మీడియాలో షేర్‌ చేసిన రమ్యకృష్ణ తనను గుర్తు పట్టండి అంటూ కామెంట్ పెట్టారు. దానికి పలువురు తమ సమాధానాలను చెప్పారు. ఆ తరువాత తాను ఎక్కడున్నానో చెబుతూ మార్క్ చేసిన అదే ఫొటోను రమ్యకృష్ణ షేర్ చేశారు.

ఈ ఫొటోలో ఎంత క్యూట్‌గా ఉన్నారో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఇటీవలే రమ్యకృష్ణ కారులో, ఆమె డ్రైవర్ మధ్యం బాటిళ్లు అక్రమంగా తరలిస్తూ.. పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో రమ్యకృష్ణ కూడా కారులో ఉండటం కొసమెరుపు. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన రమ్యకృష్ణ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న సంగతి కూడా తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news