లుంబినీ పేలుళ్ల కేసు తీర్పు వెలువరించిన ఎన్ఐఏ కోర్టు

-

ఇద్దర్ని దోషులుగాను..మరో ఇద్దర్ని నిర్దోషులుగా తేల్చిన కోర్టు

హైదరాబాద్ జంట పేలుళ్లు 2007లో  గోకుల్ చాట్, లుంబినీ పార్కులో  జరిగిన పేలుళ్ల కేసులో మంగళవారం ఎన్ఐఏ కోర్టు తీర్పుని వెలువరించింది. సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖాస్ లపై సరైన ఆధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా ప్రకటించింది.. అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అనీఖ్ షఫిక్ సయ్యద్ లను దోషులుగా ప్రకటించింది.

చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెజిగ్నేటెడ్ న్యాయస్థానంలో చేపట్టిన విచారణలో ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ ఘాతుకానికి పాల్పడిన సంగతి తెలిసిందే ..  ఈ కేసులో  మొత్తం 8 మందిని ఉగ్రవాదులుగా పేర్కొనగా…అమీర్ రజాఖాన్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. మిగిగిన ఐదుగురు నిందులపై విచారణ జరిగింది. ఇతర కేసుకు సంబంధించి తుది తీర్పుని సోమవారం వెలువరించనుంది. అదే రోజు దోషులకు శిక్షను కూడా ఖరారు చేయనున్నట్లు న్యాయస్థానం  తెలిపింది.

లుంబినీ పార్కు, గోకుల్ ఛాట్ లో జరిగిన పేలుళ్ల ఘటనలో 44 మంది మరణించగా, 68 మందికి పైగా గాయపడ్డ విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news