మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్..!

-

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈవీఎం ధ్వంసంతో సహా మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ ను పొడిగించాలని కోరుతూ పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్ ను ఈరోజు హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఎస్పీ ఆఫీసుకు తరలిస్తున్నారు.

వైసీపీ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. అరెస్టు నుంచి రక్షణ కోరుతూ వేసిన బెయిల్‌ పిటిషన్లు కొట్టేసింది. హైకోర్టులో 4 ముందస్తు బెయిల్‌ పిటిషన్లు వేశారు పిన్నెల్లి. ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసం సహా పిన్నెల్లి పై మూడు కేసులు ఉన్నాయి. కాగా ఇప్పటికి వరకు ఈ కేసుల్లో మధ్యంతర బెయిల్ పిన్నెల్లి బయట ఉన్నారు. ఇటీవల మొత్తం నాలుగు కేసుల్లో మధ్యంతర బెయిల్ ను పొడిగించాలని పిన్నెల్లి పిటిషన్ దాఖలు చేయగా.. విచారించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు తుది తీర్పు వెలువరించింది. ఆ నాలుగు పిటిషన్లను కొట్టేసింది. కాగా పిన్నెల్లి ని అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news