పిల్లల ఉజ్వల భవిష్యత్తు కాపాడడానికి గంజాయి, డ్రగ్స్ను నిర్మూలిస్తామని ఏపీ మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చారు. గంజాయి నిర్మూలనకు వంద రోజుల ప్రత్యేక కార్యాచరణని ముఖ్యమంత్రి కమిటీకి అప్పగించారని తెలిపారు. 100 రోజుల్లోనే గంజాయిని నియంత్రించడమే కమిటీ ఉద్దేశ్యం అని చెప్పుకొచ్చారు. గంజాయి వల్ల రాష్ట్రంలో స్కూల్ పిల్లలు చాలా పాడైపోతున్నారని తెలిపారు. ముఖ్యంగా గంజాయి వాడకం వల్ల ఎక్కువగా టీనేజ్ పిల్లల మానస్థిక స్థితి పాడై, ఎదురుగా ఉన్నటువంటి వారిని కూడా ఇబ్బంది పెట్టడం, అలాగే మహిళల్ని ఇబ్బంది పెట్టడం, వారిపై ఆత్యచారాలకు పాల్పడటం వంటివి చేస్తున్నారని వెల్లడించారు.
చిన్న పిల్లలు కూడా గంజాయి వల్ల ఆరోగ్యాలు కూడా పాడు చేసుకుంటున్నారన్నారు. పాఠశాలల్లో, కళాశాలల్లో ఎక్కడపడితే అక్కడ విరివిగా దొరకడం వల్ల యువత ఎక్కువగా గంజాయికి అడక్ట్ అవుతుందన్నారు. ముఖ్యంగా ఈ గంజాయి మత్తులో వారిలో వారే పిచ్చిలేపుకుని ఆత్మహత్యలు చేసుకోవడం, ఆడవాళ్ల మీద ఆత్యాచారాలు జరపడం చేస్తున్నారని పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ వాడకం తగ్గినట్లైతే మన రాష్ట్రంలో శాంతిభద్రతలు చాలా వరకు కంట్రోల్లో ఉంటాయనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి గంజాయిని కంట్రోల్ చేయడానికి వంద రోజులకు ఒక సబ్ కమిటీ వేశారని వెల్లడించారు.