బీజేపీ, కాంగ్రెస్‌ని ఢీకొట్టే పరిస్థితి లేదు : మధుయాష్కీ గౌడ్‌

-

నేడు కొందరు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్‌లో చేరారు. వారిని కాంగ్రెస్‌ కండువా కప్పి రేవంత్‌ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు గీతారెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ తదితరులు ఉన్నారు. అయితే ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్ 70 సీట్లు గెలుస్తుందని, పార్టీ సర్వే లో అదే తేలిందని ఆయన వెల్లడించారు. బీజేపీ.. కాంగ్రెస్‌ని ఢీ కొట్టే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు.

అంతేకాకుండా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో మంత్రులుగా చేసి..కోట్లు సంపాదించారు కొందరు అంటూ.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నుపోటు పొడిచి పోయారని ఫిరాయింపు నేతలపై విమర్శలు గుప్పించారు. అలాంటి వాళ్లకు బుద్ది చెప్పాలంటూ కార్యకర్తలకు, నేతలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిన వాళ్లకు బుద్ది చెప్తామని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ బలమే కార్యకర్తలు అని, తెలంగాణకు ప్రియాంక గాంధీని రప్పిద్దమన్నారు. రాహుల్..ప్రియాంక గాంధీ లను పిలుస్తున్నామని, సోనియా గాంధీతో సభకి ప్లాన్ చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version