మదర్సాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మధ్యప్రదేశ్ బీజేపీ మహిళా మంత్రి ఉషా ఠాకూర్.మదర్సాల వల్లే జమ్మూ కశ్మీర్ ఉగ్రవాద కర్మాగారంగా మారిపోయిందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.మంత్రి ఉషా ఠాకూర్ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి నరేంద్ర సలూజా డిమాండ్ చేశారు. ఉప-ఎన్నికల ప్రచారాన్ని మతపరమైన ఎజెండా వైపు మళ్లించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, మంత్రి ఠాకూర్ ప్రకటన ఈ వ్యూహంలో భాగమేనని దుయ్యబట్టారు.
ప్రజల డబ్బుతో మత విద్యను బోధించడానికి అనుమతించలేనందున ప్రభుత్వం అన్ని ప్రభుత్వ మదర్సాలు, సంస్కృత పాఠశాలలను మూసివేస్తుందని అక్టోబర్ 9న అస్సాం విద్య, ఆర్థిక మంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం నవంబర్‌లో అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తుందని మంత్రి చెప్పారు.