ఏపీలో మాఫియా ప్రభుత్వం నడుస్తోంది – కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి

-

కర్నూలు, అనంతపురం జిల్లాల్లో లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని అన్నారు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి. హంద్రీనీవాలో కాలువలో నీరు అడుగంటి పోయాయయని.. హంద్రీనీవా పనులు బిల్లులు రాక నిలిపేశారని తెలిపారు. ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కాదని.. ఎల్లేల్సీ ద్వారా సాగునీరు ఇవ్వలేని పరిస్థితి ఈ ప్రభుత్వానిదని మండిపడ్డారు. ప్రతి ఎకరాకు లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీలో మాఫియా ప్రభుత్వం నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి గుమ్మనూరు జయరాం ఎల్ఎల్సి గురించి, రైతుల గురించి మాట్లాడరా? అని ప్రశ్నించారు. నీళ్లు అడిగితే నాకు రైతు భరోసా ఇచ్చాం అన్నారు… ఎక్కడ ఇచ్చరో చూపించండని సవాల్ విసిరారు. కనీసం ఐ.ఏ.బీ మీటింగ్ కూడా పెట్టలేని పరిస్థితి లో ఈ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ఒక వారంలో రైతులకు నష్టరిహారం ఇవ్వాలి… లేకుంటే రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి. మేము వచ్చిన తరవాత అందరి పని పడతాం, పెండింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version