మహానటి ఫేమ్ కీర్తీ సురేష్‌కు వెల్లువెత్తిన బర్త్ డే విషెస్!

-

పుట్టి పెరిగింది తమిళనాడులో అయిన తెలుగు బాగా వంట బట్టించుకుని తమిళ ఇండస్ట్రీలో కంటే ఎక్కువగా తెలుగులో సినిమాలు చేస్తున్న మహానటి ఫేమ్ కీర్తీ సురేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తక్కువ టైంలోనే ఎక్కువగా క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్..‘నేను శైలజ’ మూవీతో టాలీవుడ్‌కి పరిచయమైన విషయం తెలిసిందే.

ఆ తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ‘మహానటి’ సినిమాతో తమిళ, తెలుగులో అతి పెద్ద విజయాన్ని నమోదుచేసింది. మహానటి మూవీలో సావిత్రి పాత్రకి ప్రాణం పోసిన కీర్తీ.. ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఆ సినిమాలో ఆమె నటనకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ సైతం అందుకుంది. ప్రస్తుతం, తెలుగు, తమిళం, మలయాళంలో బిజీబిజీగా మారిన కీర్తీ సురేష్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా సినీ నటులు, ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news