రాయ్‌గ‌ఢ్ ఘ‌ట‌న‌.. 14కు చేరిన మృతుల సంఖ్య‌

-

మహారాష్ట్రలో ఐదంతస్తుల‌ భవనం కుప్పకూలిన ఘ‌టనలో మృతుల సంఖ్య మ‌రింత‌గా పెరుగుతోంది. తాజాగా.. మ‌రొక‌రు మృతి చెందారు. దీంతో ఈ ప్ర‌మాదంలో మృతి చెందిన వారి సంఖ్య 14కు చేరింది. రాయ్‌గఢ్‌ జిల్లా మహద్‌ పట్టణంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగిన విష‌యం తెలిసిందే. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు స్వ‌ల్ప‌గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. అయితే.. శిథిలాల నుంచి ఇప్పటికి 113 మృతదేహాలను వెలికితీసినట్లు అధికార‌వ‌ర్గాలు తెలిపాయి.

అయితే..భవనం కూలేటప్పుడు ఎగిరివచ్చిన రాయి ఒకటి తలకు తగిలి మరో వ్యక్తి మరణించినట్లు చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రస్తుతానికి 9 మందిని కాపాడామని అధికారులు చెప్పారు. మరో ముగ్గురి జాడ ఇంకా తెలియరాలేదన్నారు. ఈ కేసులో బిల్డర్‌ ఫరూక్‌ ఖాజీ, ఆర్కిటెక్ట్‌ గౌరవ్‌ షా సహా ఐదుగురిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news