గచ్చిబౌలి సిద్దిక్ నగర్ బిల్డింగ్ ఘటన పై కేసు నమోదు అయ్యింది. బిల్డింగ్ పక్కన గుంతలు తవ్విన బిల్డర్ శ్రీను అలియాస్ కల్వకోలు శ్రీను పై కేసు నమోదు చేసారు మాదాపూర్ పోలీసులు. ఆ నిర్మాణ యజమాని యాసిన్ ఖాన్ పైనా కూడా కేసు నమోదు చేసారు. భవనం ఒక వైపుకు ఒరగడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు GHMC అధికారులు.
బిల్డర్ ఎటువంటి సెట్ బ్యాక్ లేకుండా నిర్లక్ష్యంగా గుంతలు తవ్వారని శేరిలింగంపల్లి GHMC సిటీ ప్లానర్ వేంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే గచ్చిబౌలిలో నిన్న రాత్రి ప్రక్కన నిర్మిస్తున్న నిర్మాణం కారణంగా బిల్డింగ్ కుంగిపోయిన సంగతి అందరికి తెల్సిందే. దాంతో హైడ్రా ఆధ్వర్యంలో ఈరోజు యుందయం కూల్చి వేతలు చేపట్టిన DRF సిబ్బంది రాత్రి వరకు కష్టపడి ఎవరికీ ఎటువంటి ప్రమాదం కలగకుండా.. బిల్డింగ్ మొత్తని నెల మట్టం చేసింది.