దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా రెండు రోజుల కిందట అనారోగ్యం కారణంగా కన్నుమూసిన విషయం తెలిసిందే. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆయన తుదిశ్వాస విడిచారు.ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పరిశ్రమల కోసం విశేషంగా కృషి చేస్తున్న వారికి రతన్‌టాటా స్మార్థకార్థం సర్కార్ తరపున ‘రతన్ టాటా ఉద్యోగ రత్న’ అవార్డు ఇవ్వాలని నిర్ణయించింది.
ఈ మేరకు మహారాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి ఉదయ్ సమంత్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.అలాగే ముంబైలోని ఉద్యోగ్ భవన్ పేరును ‘రతన్ టాటా ఉద్యోగ్ భవన్ గా మారుస్తున్నట్లు వెల్లడించారు. ఇక రతన్‌టాటాకు భారత రత్న అవార్డు ప్రదానం చేయాలని మహారాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుని కేంద్రానికి తీర్మానం పంపించిన విషయం తెలిసిందే.