కరోనా వ్యాప్తి కారణంగా మహారాష్ట్రలో మరో 11వేల మంది ఖైదీలను విడుదల చేయబోతున్నారు. జైళ్లలో సామాజిక దూరం ఉండడానికి గతంలో 9671 మంది ఖైదీలను విడుదల చేయగా, ఇప్పుడు మరో 11వేల మంది ఖైదీలను అత్యవసర పెరోల్ మీద విడుదల చేస్తునట్టు ఆ రాష్ట్ర హోం మినిష్టర్ అనిల్ దేశ్ ముఖ్ స్పష్టం చేశారు. అలాగే మిగిలిన ఖైదీల కోసం 31 తాత్కాలిక జైళ్లను ఏర్పాటు చేశామన్నారు.