ఆర్కే భార్య శిరీష అరెస్ట్‌ ఎన్‌ఐఏ కీలక స్టేట్‌మెంట్

-

మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ(ఆర్కే) భార్య శిరీష అలియాస్‌ పద్మను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజా ఆర్కే భార్య శిరీష అరెస్ట్‌పై ఎన్‌ఐఏ ప్రకటన చేసింది. శిరీష‌ను అరెస్ట్ చేసినట్టుగా పేర్కొంది. ఆర్కే డైరీ ఆధారంగా శిరీషను అరెస్ట్ చేశామని చెప్పింది. శిరీష‌తో పాటు దుడ్డు ప్రభాకర్‌ను కూడా అరెస్ట్ చేశామని తెలిపింది.

దుడ్డు ప్రభాకర్, శిరీష మావోయిస్టుల కోసం పని చేస్తున్నారని ఎన్ఐఏ పేర్కొంది. వీరిద్దరూ 2019లో జరిగిన తిరియా ఎన్ కౌంటర్‌లో పాల్గొన్నారని.. శిరీష, దుడ్డు ప్రభాకర్ మావోయిస్టుల రిక్రూట్ మెంట్ కోసం కూడా పని చేస్తున్నారని ఎన్ఐఏ ఆరోపించింది. మావోయిస్టుల నుండి వీరికి భారీగా నిధులు అందుతున్నాయని తెలిపింది. మావోయిస్ట్ వారోత్సవాల సందర్భంగా వీరు భారీ కుట్రకు ప్లాన్ చేశారని వీరి అరెస్ట్ సందర్భంగా ఎన్ఐఏ వెల్లడించింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version