సైబ‌ర్ పోలీసులను ఆశ్రయించిన మ‌హేశ్‌, బ‌న్నీ నిర్మాత‌లు

మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న భారీ సినిమాలు పుష్ప, సర్కారు వారి పాట సినిమాలకు సంబంధించిన లీకులు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. సర్కారు వారి పాట ఫస్ట్‌ లుక్‌, పుష్ప సినిమా నుంచి దాక్కో దాక్కో మేక సాంగ్‌ విడుదల చేయాలనుకున్న సమయం కంటే ముందే సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేశాయి. తాజాగా పుష్ప ఫైట్‌ సీన్‌ కూడా లీక్‌ అయింది. అయితే.. ఈ లీకుల వ్యవహారాన్ని సీరియస్‌ గా తీసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 

“ప్రస్తుతం మేం చేస్తున్న సర్కారు వారి పాట, పుష్పకు సంబంధించిన కంటెంట్‌ బయటకు రావడం మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. ఎవరో ఈ పనులను చేసి రాక్షస ఆనందం పొందుతున్నారు. ఇలాంటి పనుల వల్ల ప్రేక్షకుల్లో సినిమాపై ఉండే ఉత్సాహం పోతుంది. కాబట్టి మా మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ విషయాన్ని సీరియస్‌ గా తీసుకుని సైబర్‌ పోలీసులు ఫిర్యాదు చేశాం.^తప్పు చేసిన వారిని పట్టుకుని శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం. ఎవరూ పైరసీని ప్రోత్సహించవద్దు” అంటూ ఓ లెటర్‌ ను కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ ట్విట్టర్‌ లోరిలీజ్‌ చేసింది.