ఏపీ తెలంగాణకు భారీ వర్షసూచన.. !

ఏపీ తెలంగాణలో మళ్లీ గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న తెలంగాణలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయి. కాగా మరో రెండు రోజుల పాటు ఆంధ్ర మరియు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Rain

పశ్చిమ మధ్య బంగాళాఖాతం వాయవ్య భారత్ దక్షిణ ఒరిస్సా నుండి ఉత్తరాంధ్రను ఆనుకొని అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని తెలిపింది. దీనిపై ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని స్పష్టం చేసింది. దీని ప్రభావంతో రాబోయే 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి కాబట్టి వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.