ఆమె మ‌ర‌ణ‌వార్త‌తో నా గుండె ప‌గిలింది : మ‌హేష్ బాబు.!

-

ప్ర‌ముఖ బాలీవుడ్ డ్యాన్స్ మాస్ట‌ర్ స‌రోజ్‌ఖాన్ (71) శ్వాస కోస సంబంధిత స‌మ‌స్య‌తో శ‌నివారం ముంబైలోని గురునాన‌క్ ఆసుప‌త్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ ఈ శుక్ర‌వారం ఉద‌యం వేకువ జామున తుది శ్వాస విడిచారు. ఉద‌యం 2 గంట‌ల స‌మ‌యంలో ఆమెకు గుండె పోటు రావ‌డంతో క‌న్నుమూశారు. తాజాగా.. ఆమె మృతి పట్ల టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు త‌న ట్విట్ట‌ర్ ద్వారా సంతాపం తెలియ‌జేశారు.

ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ స‌రోజ్ ఖాన్ మ‌ర‌ణ‌వార్త‌తో నా గుండె ప‌గిలింది. రాబోవు త‌రాల‌కి ఆమె స్పూర్తి. ఒక శ‌కం ముగిసింది. స‌రోజ్ ఖాన్ మృతికి నా సంతాపం . కుటుంబ స‌భ్యుల‌కి నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను అని మ‌హేష్ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. స‌రోజ్ ఖాన్ తెలుగులో బాల‌కృష్ణ‌, చిరంజీవి, వెంక‌టేష్‌, నాగార్జున‌, మ‌హేష్ వంటి టాప్ హీరోల‌తో క‌లిసి పని చేసింది. ఇప్పటికే ప్రఖ్యాత నటుడు దిలీప్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ వాజిద్, స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఉదంతాలతో హిందీ చిత్రపరిశ్రమ తీరని బాధలో ఉన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version