మహేష్ బాబు ఫేవరెట్ ఫైట్ మాస్టర్స్ వారేనట..ఎందుకంటే..?

-

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా పరుశురాం దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట . ఈ సినిమా మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు థియేటర్ లలో చాలా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా ఘనంగా నిన్న సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహించడం జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా తమ అనుభవాలను పంచుకున్నట్టే.. సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు కూడా పలు విషయాలను పంచుకున్నాడు. అంతేకాదు ఫైట్ మాస్టర్స్ పైన ఆయన చేసిన షాకింగ్ కామెంట్స్ ప్రస్తుతం బాగా వైరల్ గా మారుతున్నాయి.Mahesh Becomes Emotional At SVP Pre-release Event - Movie News

మహేష్ బాబు నిజానికి తన కథల్లో కొత్తదనం.. పాత్రల్లో వైవిధ్యం ఉండాలని ఎప్పుడూ కోరుకుంటారు. తన దగ్గరకు వచ్చే దర్శకులకు కూడా ఈ రకంగా ఉండే కథలను మాత్రమే వినిపించమని చెబుతూ ఉంటారు. మహేష్ బాబుకు కథ వినిపించాలి అంటే పర్ఫెక్ట్ గా తయారు చేసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలోనే వచ్చిన సర్కారు వారి పాట సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగాయి. నిజంగా మహేష్ బాబు సినిమా అంటే కమర్షియల్ సూపర్ హిట్ చిత్రం అని చెప్పడంలో సందేహం లేదు. కథ బాగా లేక డిజాస్టర్ గా మిగిలినా కమర్షియల్ హిట్ మాత్రం ఆ సినిమా ఇస్తుందని చెప్పవచ్చు.Fight masters Ram, Lakshman reveal Mahesh Babu's glamour secretఇకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన మహేష్ బాబు ఆ సినిమా ఫైటర్స్ గురించి చాలా గొప్పగా చెప్పారు. మహేష్ బాబు మాట్లాడుతూ.. రామ్ లక్ష్మణ్ ఇద్దరూ నా ఫేవరెట్ ఫైట్ మాస్టర్స్.. ఇప్పటికీ కూడా వారిలో రామ్ ఎవరో.. లక్ష్మణ్ ఎవరో నిజంగా తెలియదు. కానీ వాళ్ళిద్దరినీ రామ్ లక్ష్మణ్ అని పిలుస్తూ ఉంటాను. వారిలో నాకు నచ్చే మొదటి లక్షణం ఏమిటంటే హీరో తో ఎలా అయితే ప్రవర్తిస్తారో.. మిగిలిన ఫైటర్స్ తో కూడా అలాగే ప్రవర్తిస్తారు. అందుకే వీరిలో నాకు బాగా ఈ లక్షణం నచ్చుతుంది. బహుశా అందుకేనేమో వీరిద్దరూ అంత పెద్ద ఫైట్ మాస్టర్లు కూడా అయ్యారు అంటూ వారి గురించి గొప్పగా చెప్పుకొచ్చారు మహేష్ బాబు.

Read more RELATED
Recommended to you

Latest news