మహేష్ చేంజ్: సురకత్తిలాంటి సూపులతో దూసుకుపోతుండు!

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్వచ్ఛమైన తెలుగుతనం ఉట్టిపడే హాలీవుడ్ హీరోలా దర్శనమిస్తుంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్నప్పుడల్లా కాకుండా అవసరమైనప్పుడే చిరుస్మితం, సుందరదరహాసం మహేష్ మోము నుంచి జాల్వారుతుంటుంది. అదీ చాలా మితంగానే ఉంటుంది. అసలు ఆ నవ్వులో ఏముందో.. మహేష్ నవ్వు మహత్తు ఏంటో తెలియదు గానీ.. అలా ఓ చిరునవ్వుతో ప్రేక్షకుల మతులు పోగొడుతున్నాడు.

ఒక్క నవ్వుతో అభిమానులను తెలియని మహత్తులోకి తీసుకెళ్తున్నాడు. ఆనంద పరవశులను చేస్తున్నాడు. గుండెలను పిండి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా చేస్తున్నాడు. ఇంతకీ ఏమిటా మహత్తు. మహేష్ నవ్వు వెనక దాగి ఉన్న మత్తు వంటి మహత్తు ఏంటి? అంటే… ఏమిటో….. అది తెలియని గమ్మత్తైన మహత్తు అని మురిసిపోతుంటారు మహేష్ అభిమానులు.

ఇంకా… మహేష్ సొగసు చూసి పెళ్ళైన అమ్మాయిలు కూడా ఫిదా అయిపోతుంటారు! ఇక మహేష్ సుతిమెత్తని డైలాగ్ లు, సినిమాలో చాలా షార్ఫ్ గా, మెత్తని చురకత్తుల్లా ఉండే మాటతీరు చూస్తే థియేటర్లో ఈల వేసి గోల చేయని ప్రేక్షకుడు ఉండడు అంటే నమ్మలేని నిజం. అలా మహేష్ బాబు అందం.. ఆ వెనుక ఉన్న రహస్యాలను పొగడ తరమా.. అబ్బే.. అస్సలు సాధ్యం కాదు.

అయితే విషయం ఏమిటంటే.. సహజంగా సెలబ్రిటీలు తరచుగా సోషల్ మీడియా “డిస్ ప్లే పిక్” లను మారుస్తూ ఉంటారు. మహేశ్ బాబు చాలా కాలం నుంచి ఒకటే పిక్ ను కొనసాగిస్తూ వచ్చారు. తాజాగా.. మహేశ్ కూడా తన పిక్ ను మార్చేశారు. ఇదే సమయంలో ప్రొఫైల్ పిక్ ను కూడా ఆయన చేంజ్ చేశారు. ఈ రెండూ మహేశ్ కొత్త ఫోటోలే కావడం విశేషం. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. సురకత్తిలాంటి చూపులతో మహేష్ దర్శనమిస్తుండటం చూపరులకు మంచి కిక్ ఇచ్చేలా ఉంది అనండంలో ఏమాత్రం సందేహం లేదుందున్నారు మహేష్ ఫ్యాన్స్.

Read more RELATED
Recommended to you

Latest news