మహేష్ బాబు అదిరిపోయే లైనప్.. త్రివిక్రమ్ తర్వాత అనిల్ తో..

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ కూడా జరుపుకుంది. ప్రస్తుతం కరోనా వల్ల చిత్రీకరణ ఆగిపోయింది. సర్కారు వారి పాట తర్వాత మహేష్ ఎవరితో సినిమా చేస్తాడనే దానికి కొద్ది రోజుల క్రితమే సమాధానం వచ్చింది. మహేష్ బాబు 28వ సినిమా త్రివిక్రమ్ తో ఉంటుందని అధికారికంగా ప్రకటించారు.

త్రివిక్రమ్ తో సినిమా తర్వాత ఇక రాజమౌళితోనే ఉంటుందని అనుకున్నారు. కానీ అలా జరగడం లేదని టాక్. అవును, తాజాగా అనిల్ రావిపుడి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం త్రివిక్రమ్ తో సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ సినిమా ఉంటుందట. అంటే, ఆ తర్వాతే రాజమౌళి సినిమా మొదలవుతుందన్నమాట. ఈ లెక్కన రాజమౌళి-మహేష్ కాంబినేషన్లో సినిమా రావడానికి 2024వచ్చేస్తుందేమో!