కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కి నో చెప్పిన మహేష్ బాబు.. కారణం..?

-

సూపర్ స్టార్ మహేష్ బాబు కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఆయన సినిమాలు కథాపరంగా మంచి కమర్షియల్ విజయాలను సొంతం చేసుకుంటూ ఉంటాయి . ఈ నేపథ్యంలోనే ఇటీవల వచ్చిన సర్కారు వారి పాట సినిమా కూడా కథలో కొంచెం సాగదీసినా.. కమర్షియల్ పరంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు మహేష్ బాబు.. ప్రస్తుతం అమెరికాలో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న ఈయన ఇండియాకు తిరిగి రాగానే షూటింగ్ ప్రారంభం చేసి ఈ ఏడాది చివరికల్లా సినిమా పూర్తి చేయాలని త్రివిక్రమ్ సన్నాహాలు చేస్తున్నారు.Telugu actor Mahesh Babu calls himself shy and sensitive- The New Indian Express

ఈ సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మహేష్ బాబు. ఇకపోతే జక్కన్న సినిమా అంటే రెండు సంవత్సరాలు కచ్చితంగా పడుతుంది. కాబట్టి 2024లో ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక అంతటి వరకు వేరే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు మహేష్ బాబు. ఇదిలా ఉండగా తాజాగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మహేష్ బాబు కోసం ప్రత్యేకంగా కథను సిద్ధం చేసి వినిపించగా మహేష్ బాబు ఆసక్తి చూపడం లేదని పైగా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు గల కారణం ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..Lokesh Kanagaraj: Master is not a fanboy film- Cinema express

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ మహేష్ బాబు కోసం ప్రత్యేకంగా కథ సిద్ధం చేసి ఇటీవల వెళ్లి వినిపించారట. కానీ మహేష్ బాబు రిజెక్ట్ చేశారు అని ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఆల్రెడీ మురుగదాస్ తో స్పైడర్ సినిమా చేసి డిజాస్టర్ గా మిగిలింది. దీంతో ఇప్పుడిప్పుడే కోలీవుడ్ దర్శకులతో సినిమా చేయడానికి ఆసక్తి చూపడం లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news