హెచ్చరిక.. ఈ యాప్స్‌ ఉంటే వెంటనే డిలీట్‌ చేయండి..

-

ప్లేస్టోర్ లక్షల కొద్దీ యాప్స్‌.. కొన్ని కొన్ని యాప్స్ తెలియకుండా డౌన్‌లోడ్‌ చేస్తుంటాం. అయితే ప్రమాదకరమైన ఓ ఏడు యాప్స్ ఉన్నాయి. ఇవి మీ డబ్బుల్ని తస్కరించగలవు. ఆ యాప్స్‌ను వెంటనే తొలగించకపోతే మంచిదంటున్నారు సైబర్ నిపుణులు.ప్రస్తుత తరుణంలో స్మార్ట్‌ఫోన్ జీవితంలో ఓ భాగంగా మారిపోయింది. ప్రతి పనికి యాప్స్ ఉన్నాయి. అయితే కొన్ని యాప్స్ ప్రమాదకరమైనవిగా ఉంటాయి. వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదకరమైన స్పైవేర్ ఎప్పటికప్పుడు గూగుల్ ప్లే స్టోర్‌లో చొచ్చుకుపోతుంటుంది.

Fake apps online scam: How over 5 lakh Indians were cheated of ₹150 crore by Chinese nationals | HT Tech

సైబర్ సెక్యూరిటీ కంపెనీ ట్రెండ్ మైక్రో..తాజా అధ్యయనం వెలువరించింది.ప్లే స్టోర్‌లో 2 వందల కంటే ఎక్కువ యాప్స్‌లో ఫేస్ స్టీలర్ పేరుతో ఓ ప్రమాదకరమైన స్పైవేర్ ఉందని వెల్లడించింది. ఇది యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేయడమే కాకుండా ఫేస్‌బుక్ పాస్‌వర్డ్ వంటి వివరాలు కూడా తస్కరిస్తుందట. మరోవైపు 40 కంటే ఎక్కువ నకిలీ క్రిప్టోక్యూరెన్సీ మైనర్ యాప్స్ గురించి ఈ నివేదిక వివరించింది. ఇందులో క్రిప్టోకరెన్సీను దొంగిలించడం, యూజర్ అనుమతి లేకుండా రిక్వస్ట్ సమాచారాన్ని పంపించడం చేస్తుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news