మే 31న టీజ‌ర్ ట్రీట్ ఇవ్వ‌నున్న మ‌హేశ్ బాబు..

-

సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబు కు టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న సినిమా వ‌స్తుందంటే మిగ‌తా సినిమాలు వాయిదా ప‌డాల్సిందే. ఇండ‌స్ట్రీ స‌రికొత్త రికార్డులు న‌మోదు చేసుకోవాల్సిందే. మ‌రి ఆయ‌న న‌టిస్తున్న సినిమాల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క టీజ‌ర్‌, కంప్లీట్ లుక్ కూడా రాలేదు.

దీంతో ఆయ‌న అభిమానులు తీవ్ర నిరాశ‌లో ఉన్నారు. దీంతో ఇప్పుడు వారిని కుషీ చేసేందుకు మ‌హేశ్‌బాబు స్కెచ్ వేశాడ‌ని తెలుస్తోంది. మే31న త‌న తండ్రి కృష్ణ పుట్టిన రోజు. ప్ర‌తి మే31న ఏదో ఒక పోస్ట‌ర్ లేదా టీజ‌ర్ రిలీజ్ చేస్తూ వ‌స్తున్నారు.

అయితా మ‌హేశ్ బాబు న‌టిస్తున్న స‌ర్కారువారిపాట‌కు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు టీజ‌ర్ రిలీజ్ కాలేదు. దీంతో ఈమే 31న రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను కుషీ చేయాల‌ని చూస్తున్నాడు సూప‌ర్‌స్టార్‌. దీంతో సినిమాపై కూడా హైప్ పెంచిన‌ట్టు అవుతుంద‌ని టీమ్ భావిస్తోందంట‌. మ‌రి టీజ‌ర్ రిలీజ్అయి ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news