పోకిరి, దూకుడు కన్నా ” సర్కారు వారి పాట” పెద్ద హిట్ – మహేష్‌ బాబు

-

” సర్కారు వారి పాట” లో నా క్యారక్టర్‌ బాగా నచ్చిందన్నారు హీరో మహేష్‌ బాబు. సర్కారు వారి పాట సక్సెస్ మిట్ లో మహేష్ మాట్లాడుతూ…. ఎప్పుడో ఒక్కడు టైం లో కర్నూల్ వచ్చానని..మీ అభిమానం ఎప్పుడు ఇలా వుండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. నేను సర్కారు వారి పాట ఫ్యామిలీ తో చూసినప్పుడు మా అబ్బాయి గౌతమ్ హగ్ చేసుకొన్నాడని.. అమ్మాయి సితార అయితే నీ అన్ని సినిమాల్లో కన్న బాగా చేసావు అందంగా కనపడ్డావు అన్నారని ఎమోషనల్‌ అయ్యారు.

ఆ క్రెడిట్ దర్శకుడు పరశురామ్ దేనని.. నాకు బాగా నచ్చిన క్యారెక్టరైజేషన్ సర్కారు వారి పాట అని తెలిపారు. మీరు నాకు ఇచ్చిన ఈ సక్సెస్ ఎప్పుడు గుర్తుండిపోతుందని.. నా ఫేవరేట్ మూమెంట్ లవ్ ట్రాక్ అది నాకు విపరీతంగా నచ్చిందని వెల్లడించారు మహేష్‌ బాబు. ఆడియన్స్ ఇచ్చిన సక్సెస్ నిజంగా స్పెషల్ అని… కరోనా వల్ల ఈ సినిమాకీ చాలా కష్ట పడ్డామని చెప్పారు. కృష్ణ గారు సినిమా చూసి పోకిరి, దూకుడు కన్నా పెద్ద హిట్ అవుతుందని చెప్పారన్నారు. సర్కారు వారి పాట నాకిచ్చి నందుకు మైత్రి మూవీ మేకర్స్ వారికి థాంక్స్ చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news