హీరో మహేశ్ బాబు హుందాతనం కు హ్యాట్సాఫ్..!!

-

తమిళ సినిమా పరిశ్రమ లో ఎస్‌జే సూర్య ఒక సంచలనం. తాను ఇటు దర్శకుడు గా అలాగే నటుడుగా కూడా తనని తాను నిరూపించుకున్నాడు. ఇప్పుడు డైరెక్టర్ కంటే నటుడుగా ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. గతంలో తాను పవన్ కళ్యాణ్ తో ఖుషి వంటి బ్లాక్ బస్టర్ మూవీ సినిమా తీశాడు. అప్పట్లో ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.

ఇక తాను సూపర్ స్టార్ మహేష్ బాబు తో కూడా సినిమా తీశాడు. ఆ సినిమానే నాని.స్టార్‌ హీరోగా ఎదుగుతోన్న సమయంలో మహేష్‌ బాబు ఒక ప్రయోగాత్మక చిత్రంలో నటించడం చాలా డేరింగ్ నిర్ణయం అని చెప్పాలి. అయితే ఈ భారీ డిజాస్టర్‌ మూటగట్టున్న మహేష్‌  బాబు నటనకు ప్రశంసలు అందుకున్నారు. నాని ఫ్లాప్‌ తర్వాత మహేష్‌ వ్యక్తిత్వం తనకు బాగా నచ్చింది అని ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు.

నాని విషయంలో ఎప్పటి నుంచో ఓ బాధ మిగిలిపోయిందన్న సూర్య.. ఆ సినిమాను కష్టపడి తీశానని, కాని నాని చిత్రంలో ఎక్కడో తప్పు జరిగిందని అన్నారు. ‘నాని విడుదల తర్వాత ఓసారి మహేష్‌ మాట్లాడుతూ.. ‘మీరు ఎంతో ఇష్టపడి ఈ చేశారు. ఆ విషయం నాకు బాగా తెలుసు. సినిమా ఫ్లాప్ అయ్యింది అని బడపడవద్దు మీ కమిట్ మెంట్ నాకు తెలుసు అని మనసులో ఏమి పెట్టుకోకుండా అన్నారు. దీనితో ఇంత మంచి మనిషికి హిట్ ఇవ్వలేక పోయాననే బాధ రెట్టింపు అయ్యింది. కాని ఏదో ఒక రోజు మళ్లీ మహేశ్ బాబు తో సినిమా తీసి హిట్ కొట్టి నా లోని గిల్టీ ఫీలింగ్ తీసి వేస్తానని చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version