అడవి శేషు వైవిద్యమైన కథలని ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని అలరించే నటుడు.. తాజాగా అతను నటించిన హిట్ 2 పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది.. తాజాగా హిట్ 2 సక్సెస్ సెలెబ్రేషన్స్ లో మాట్లాడుతూ ఈ చిత్రం ద్వారా ఎదురైన స్వీట్ మెమొరీస్ గుర్తు చేసుకున్నాడు అడివి శేష్..
హిట్ 2 తో అడివి శేష్ మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అలాగే ఒక ప్రాంఛైజీలా హిట్ సిరీస్ కొనసాగనుంది.. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేసిన సంగతి తెలిసిందే. హిట్ 3లో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించబోతున్నడన్న విషయాన్ని హిట్టు క్లైమాక్స్ లో చెప్పిన సంగతి తెలిసిందే.. ఇక హిట్ 2లో అడివి శేష్ తన పెర్ఫామెన్స్ తో అదరగొట్టేసినట్లు ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నాయి.. హిట్ 2 ఘనవిజయం సాధించడంతో హిట్ 3పై ఇప్పటి నుంచే బజ్ మొదలైంది. అయితే ఈ చిత్రం చూశాక తనకి ఎదురైనా అనుభవాలను చెప్పుకొచ్చిన అడవి శేషు..
“హిట్ 2 రిలీజ్ రోజు ప్రీమియర్ షోలు మొదలయ్యాక నాకు వరుసగా ఫోన్ కాల్స్ స్టార్ట్ అయ్యాయి. మహేష్ బాబు సర్ మూడు మిస్ కాల్స్ చేసి ఉన్నారు. ఏమైందో ఏమో అని కంగారుగా ఫోన్ చేశా. ఏమైంది సర్ అని అడిగితే.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది శేష్ అని అన్నారు. అక్కడ నాకు ఒక యుఫోరియా మొదలయ్యింది. ఆ మాట అనగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి…” అన్నాడు.. అలాగే వెంటనే “సర్ మీరు ఒకే సంవత్సరం ముగ్గురిని కోల్పోయారు. అది ఎవరూ భరించలేని చేదు అనుభవం. సర్ మీ చుట్టూ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా ఉన్నారు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. మీకు ఒక తమ్ముడిలా ఎప్పుడూ తోడుంటా.. ” అని ఆయనకు చెప్పా అని అడవి శేష్ తెలిపాడు.