పోలీస్ స్టేషన్ ముందే విషం తాగుతా..టిఆర్ఎస్ ఎమ్యెల్యే సంచలనం !

-

టిఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ను టార్గెట్ చేస్తూ… అనుచిత వ్యాఖ్యలు చేశారు. నందీశ్వర్ తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడారు.

తన రాజకీయ జీవితంలో ఒక్క గజం స్థలం కబ్జా చేసినట్లు రుజువు చేసిన పట్టణంలోని పోలీస్ స్టేషన్ ముందు విషం తాగి ఆత్మహత్య చేసుకుంట అంటూ చాలా విషయాలు మహిపాల్ రెడ్డి. నందీశ్వర్గౌడ్ తాను ఎంపీపీ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పటాన్చెరువు నియోజకవర్గం పరిధిలో చేసిన అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

తనపై ఉన్న కేసును సుప్రీం కోర్టు ఆదేశాలతో హైకోర్టు ఎప్పుడో కొట్టేసిందని చెప్పుకొచ్చారు. నందీశ్వర్గౌడ్ 2023 లో బీజేపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని నిలబడితే… సామాన్య టిఆర్ఎస్ కార్యకర్తలు నిలబెట్టి ఎమ్మెల్యే గెలిపిస్తాం అని సవాల్ విసిరారు. నందీశ్వర్గౌడ్ తనపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని హెచ్చరించారు ఆయన చేసే ఆరోపణలు నిజమైతే సాక్షాలతో ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version