బండి సంజయ్ ని బట్టలిప్పి రోడ్డుపై నిలబెడతా : మైనంపల్లి

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలపై టిఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ ని బట్టలిప్పి రోడ్డుపైన నిలపెడతానంటూ మైనంపల్లి ఫైరయ్యారు. బండి సంజయ్ పై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ తనకు ఒక్క అవకాశం ఇస్తే బిజెపి నేతల అంతు చూస్తాం అని ఆయన వ్యాఖ్యానించారు.

Mainamplly hanumantharao on bandi Sanjay
Mainamplly hanumantharao on bandi Sanjay

మల్కాజ్గిరి నియోజకవర్గంలో అశాంతిని సృష్టించడానికే బండి సంజయ్ ఇలాంటి పనులు చేస్తున్నాడని అన్నారు. మల్కాజ్ గిరి నియోజక ప్రజలు ఆందోళన చెందవద్దని మైనంపల్లి తెలిపారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన బండి సంజయ్ ని బరాబర్ తిడతం అంటూ మైనంపల్లి వ్యాఖ్యానించారు. బండి సంజయ్ తనకు గోరు తో సమానం అని ఢిల్లీలో వెళ్లి తాను ఎవరినీ కలవలేదని ఆయన అన్నారు. బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ఊరుకోమని మైనంపల్లి తెలిపారు. మూసుకున్న దుకాణాలను తాము తెరిపిస్తామని మైనంపల్లి హనుమంతరావు చెప్పారు.