మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. తూప్రాన్ 44వ జాతీయ రహదారి నాగులపల్లి వద్ద రాజస్థాన్ నుండి 30 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది.
తెల్లవారు జామున బస్సు రన్నింగ్‌లో ఉండగా.. దాని వెనుక చక్రాలు అనుకోకుండా ఊడిపోయాయి.అయితే, డ్రైవర్ అప్రమత్తత కారణంగా బస్సు సైడ్ వాల్‌కు ఢీకొని నిలిచిపోయింది. ఈ ఘటనలో బస్సు డ్యామేజ్ అవ్వగా.. అద్దాలు ధ్వంసం అయ్యాయి.అయితే, అదృష్టవ శాత్తు బస్సులోని వారికి ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు.చిన్నిచిన్నగాయాలతో వారంతా క్షేమంగా బయటపడినట్లు సమాచారం. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందగా..అక్కడకు వెళ్లి విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.